ఉత్తమ సేవలలో ఐసీటీసీ…

ఉత్తమ సేవలలో ఐసీటీసీ…

– అవార్డు అందుకున్న కౌన్సిలర్ రమేష్

– ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్

తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పురపాలక కార్యాలయం సమావేశం మందిరంలో హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నియంత్రణలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలకు చెందిన పలు వురికి సర్టిఫికెట్లతో పాటు మెమొంటో అవార్డులను బహుకరిం చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ కోర్టు జడ్జి జస్టిస్ జయరాం రెడ్డి చేతుల మీదుగా మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఐ సి టి సి కౌన్సిలర్ గాదే రమేష్ , ల్యాబ్ టెక్నీషియన్ తెరులుమర్తి శ్రీనివాస్ , చిట్యాల కౌన్సిలర్ మహేందర్, సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉమాదేవి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ అన్వేష్ని ,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు వైద్య సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.