వెంకటాపురం మండలానికి కొత్తగా 26 టీచర్ పోస్టులు

వెంకటాపురం మండలానికి కొత్తగా 26 టీచర్ పోస్టులు

– మండల విద్యాధికారి కార్యాలయంలో టీచర్ల జాయినింగ్ సందడి. 

– శుభాకాంక్షలు తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘాలు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 వేలకు పైగా డిఎస్సీ ధ్వారా నూతన ఉపాధ్యాయుల నియామకం జరపగా ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి 26 టీచర్ పోస్టులు జిల్లా విద్యా శాఖ కేటాయించింది. ఈ మేరకు బుధవారం నూతనంగా సెలెక్ట్ అయిన ఎస్జీటీలు, ఎస్.ఏ.లు 26 మంది వారి వారి పాఠశాలలకు ఉపాధ్యాయులుగా జాయినింగ్ అయ్యేందుకు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి  తరలివచ్చా రు. అలాగే వెంకటాపురం మండలంలోని సీనియర్ ఉపాధ్యా యులు సైతం నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించ బోయే నూతన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు. ఈ మేరకు మండలంలోని 47 ప్రాథమిక పాఠశాలలు, ఆలుబాక ,వెంకటాపురం రెండు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో 113 మంది ఉపాధ్యాయులు విద్యాబోధన నిర్వహిస్తున్నారు. అలాగే నూతన ఉపాధ్యాయులు 26 కలిపి మొత్తం అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల సంఖ్య 139 కీ చేరుకుంది. అలాగే వెంకటా పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు వ్యాయామ ఉపా ధ్యాయుని పోస్ట్ కూడా మంజూరు అయింది. ఆయా ఉపాధ్యాయులు మండల విద్యాధికారి సత్యనారాయణ వద్ద జాయినింగ్ రిపోర్టు, కేటాయించిన పాఠశాలల ఉత్తర్వుల కాపీలను స్వీకరించి, ఈరోజు నుండే విధుల్లోకి జాయిన్ అయినట్లు విద్యాశాఖ నియమ నిబంధనల ప్రకారం రికార్డులలో నమోదు చేశారు. కొత్త ఉపాధ్యాయులు, పాత ఉపాధ్యాయులు అందరూ ఆనందంగా సంతోషంగా, మండల విద్యాశాఖ అధికారి కార్యలయానికీ తరలి రావడంతో,ఎం.ఇ .ఒ కార్యాలయం వద్ద శుభాకాంక్షలు సందడిగా నెలకొన్నది. 2000, 2001వ సంవత్సరం అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకేసారి 20వేల టీచర్ పోస్టులు డిఎస్సీ లో భర్తీ చేసింది. కాగా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పదవి బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల్లోని 11 వేలకు పైగా నూతన ఉపాధ్యా యుల పోస్టులను మంజూరు చేసి రికార్డు సృష్టించారు. ప్రస్తు త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి విద్యా విధానం, బోధన సక్రమంగా జరిగే విధంగా పూర్తి స్తాయి ఖాళీల పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ 2024లో, 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి ప్రబుత్వ పాఠశాలలకు, నూతన విద్యా శోభను అందించడంతో విద్యార్థులు తల్లిదం డ్రులు, గ్రామస్తులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment