26 లారీలకు రూ. 21500 జరిమాన

26 లారీలకు రూ. 21500 జరిమాన

– లారీ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ 

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : 26 లారీలకు రూ. 21,500 ఎటూరునాగారం ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ బుధవారం విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎటూరునాగారం ఎన్ హెచ్ 163 పై సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై 26 ఇసుక లారీలను నిలిపారని అన్నారు. నిబంధన లు ఉల్లంగించినందుకు గాను 26 లారీలకు రూ. 21500లను జరిమానాను విధించినట్లు తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని వాహనదారులను హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అన్ని పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన, ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా రోడ్లపై పార్కింగ్ చేసినా శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని లారి డైవర్లకు తెలియజేశారు. ఎస్సై ప్రసాద్ వెంట కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గోపి, టిఎస్ఎస్పి సిబ్బంది ఉన్నారు.