వెంకటాపురం నుండి మేడారంకు 20 ప్రత్యేక బస్సులు
వెంకటాపురం నుండి మేడారంకు 20 ప్రత్యేక బస్సులు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ములుగు జిల్లా నూగూరు వెంకటా పురం, ఏటూరునాగారం నుండి మేడారం మహా జాతరకు సత్తుపల్లి టిఎస్ ఆర్టిసి డిపోకు చెందిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు వెంకటాపురం నుండి పది బస్సులు, ఏటూరునాగారం నుండి పది బస్సులను కేటాయిస్తూ టీఎస్ఆర్టీసీ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారి చేశారు. ఈ మేరకు సత్తుపల్లి ఆర్టీసి డిపోకు చెందిన అధికారులు, సిబ్బంది వెంకటాపురంలో కాపెడ్ గ్రౌండ్, మరియు వెంకటాపురంలోని బస్ స్టేషన్ ఆవరణ పరిసరాలను పరిశీలించారు. గత కొన్ని సంవత్సరాలుగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సత్తుపల్లి టిఎస్ఆర్టిసి కి చెందిన ప్రత్యేక బస్సులు వెంకటాపురం, ఎటు రు నాగారం నుండి నిర్వహిస్తున్నారు. 2022లో జరిగిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సత్తుపల్లి టిఎస్ఆర్టిసి డిపో బస్సులు విజయవంతం రాత్రి ,పగలు యాత్రికులకు స్షెషల్ బస్సు ల సౌకర్యం కల్పించి విజయవంతంగా నిర్వహించి యాత్రికుల ప్రశంసలు పొందారు. జాతరకు వెళ్లే ప్రయాణికుల, యాత్రికుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే బస్సులను నిలిపి ఉంచేందుకు వెంకటాపురం శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కాపెడ్ గ్రౌండ్ లో, గతంలో మాదిరిగానే బస్సులను నిలిపి ఉంచేందుకు పరిశీలించారు. అలాగే సిబ్బంది బస చేసేందుకు కాపేడ్ సంస్థ కు చెందిన భవనాన్ని కూడా పరిశీలించారు. ఈ మేరకు రెవెన్యూ పోలీస్ మరియు ఇతర శాఖలకు చెందిన అధికారులను ప్రజా ప్రతినిధులను మండల అధికారులును టిఎస్ఆర్టిసి సత్తుపల్లి డిపో రూట్ అదికారులు ,సిబ్బంది కలిసి మేడారం స్పెషల్ ఆర్టీసీ బస్సులకు నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఆయా బస్సులకు మరమ్మత్తులు ఏమైనా వస్తే వెంటనే నిర్వహించేందుకు, సత్తుపల్లి డిపోకు చెందిన మెకానిక్ లు , మరియు స్పేర్ పార్ట్లు, టైర్లు, గాలి మిషన్లు ఇతర పరికరాలు కూడా సిద్దం చేసారు. మేడారం వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్ స్టేషన్ లో బస్సు నిండిన వెంటనే దాని వెనుకనే, మరో బస్సు అనే సీరియల్ విధానంతో, రేయింభ వళ్ళు వేలాది మంది భక్తులను వెంకటాపురం, ఎటునాగారం బస్ స్టేషన్ల నుండి మేడారం మహా జాతరకు తరలించి, తిరిగి ఆయా బస్ స్టేషన్ పాయింట్లు లలో బక్తులకు యాత్రికులకు సేవలం దించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ప్రత్యేక మేడారం బస్సులు వెంకటాపురం నుండి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు సిబ్బంది వెంకటాపురంలో, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులను కలిసి, సౌకర్యాలు ,బస్సులు నిలిపించేందుకు మరియు ఇతర సౌకర్యాల విషయం పై ఆయా శాఖల అధికారులకు, ఆర్టీసీకి సహకరించాలని కోరారు. వెంకటాపురం, వాజేడు ప్రాంతాల నుండి శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వేలాది మంది భక్తులు ప్రతి ఏడాది తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే జాతరకు నెలరోజుల ముందు నుండే ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు శ్రీ సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.