108 అంబులెన్స్ లో ప్రసవం : తల్లి బిడ్డ క్షేమం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు కాలనీలో పురిటి నొప్పులతో బాధపడుతున్న మడకం సునీతను 108 అంబులెన్స్ ద్వారా వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువస్తుండగా మార్గ మధ్యలో వెదుళ్ళ చెరువు సమీప ప్రాంతంలో 108 సిబ్బంది డెలివరీ చేశారు. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. క్షేమంగా ఉన్న తల్లి బిడ్డలను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. 108 సిబ్బంది ఈఎంటి వినోద్, పైలట్ నదీర్ భాష లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.