పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తుల అరెస్టు

పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తుల అరెస్టు

– పట్టుకొన్న సీపీ టాస్క్ ఫోర్స్ టీమ్

– రూ.14 లక్షల 48 వేల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం

రామగుండం, తెలంగాణ జ్యోతి : రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి)  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ సంజయ్ అధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టకున్నారు. చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని మూడు ముక్కలు (పేకాట) ఆడుతున్నారు అనే పక్కా సమాచారంతో పేకాట స్థావరం పై దాడి చేసి 10 జూదరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు, రూ.14 లక్షల 48 వేల నగదు, పేక ముక్కలు స్వాధీన పరచుకొన్నారు. సందెల తిరుపతి, అన్నాల తిరుపతి, చోటు, వరంగల్ మొదలగు కొంతమంది కలిసి ఒక టీం గా ఏర్పడి పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ ఆసిఫాబాద్, ఏరియల నుండి పేకాటా ఆడే కొంతమంది ప్లేయర్లను పిలుచుకొని, కొంత పెట్టుబడి పెట్టి, అటవి ప్రాంతాలలో రోజుకు ఒక ఏరియాలో పేకాట స్థావరాలు ఏర్పాటుచేసి, వచ్చిన ఆటగాళ్ల నుండి కొంతమొత్తంలో వసూలు చేస్తూ పేకాట స్థావరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో నలుగురు లేదా ఐదుగురు కలిసి ఒక కంపెనీగా ఏర్పడి కంపెనీ పెట్టుబడిగా సుమారు 5 లక్షల వరకు పెట్టడం జరుగుతుంది. వచ్చిన ప్లేయర్ల నుండి కొంత మేర కమిషన్ కింద వసూలు చేస్తూ, సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు ఆడే ప్రదేశానికి చుట్టుపక్కల రహస్యంగా కొంతమంది వ్యక్తులను సెంట్రీలుగా ఏర్పాటు చేసుకొని, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని పోలీసు వారు గాని వచ్చినట్లయితే త్వరగా సమాచారం అందించే ఏర్పాటు చేసుకుంటారు. పేకాట ఆడుతున్న ధరణి బాపు, అన్నాల తిరుపతి, బడికల లచ్చయ్య, కంచరపు వెంకటేశ్వరావు, భూoబత్తుల శంకర్, గాండ్ల సంతోష్, పెండాల రాజేందర్, జోడి శ్రీనివాస్, భీమనపల్లి శ్రీనివాస్, దాడి నగేష్ లను కోర్టులో హాజరు పరిచారు.