హేమాచల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి.a
– ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ
ఏటూరునాగారం ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలకగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నాగజ్యోతి- జగదీష్ దంపతులను ఆశీర్వదించి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతి రాకతో మల్లూరు గ్రామంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు ఆలయ ధ్వజస్తంభానికి, ఆంజనేయ స్వామికి బొడ్రాయి, గ్రామ దేవతలకు నాగజ్యోతి భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షులు కెసిఆర్ మూడవసారి సీఎం గా గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.