హమాలీ కార్మికులతో దుద్దిళ్ళ మాటా ముచ్చట
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్న మంథని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంగళవారం నాడు హమాలీ కార్మికులతో మాట ముచ్చట జరిపారు. భోజన విరామ సమయంలో హమాలి కార్మికులతో మాటామంతి కలిపారు. మంగళవారం ప్రచారంలో భాగంగా గారెపల్లి హమాలీ సంఘం వద్ద కార్మికులు గుమకూడి ఉండడం చూసి వారి యోగ క్షేమాలు తెలుసుకొన్నారు హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు, హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మండల పార్టీ అధ్యక్షుడు వేమునూరు ప్రభాకర్ రెడ్డి, కాటారం ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గద్దె సమ్మిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, చీమల వెంకటస్వామి, చీమల రాజు, పసుల మొగిలి తదితరులు పాల్గొన్నారు.