ములుగు డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ లో గత కొన్ని రోజులు గా అనారోగ్యంతో బాధపడుతున్న స్టాఫ్ నర్స్ కు ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం ఏరియా ఆసుపత్రి వైద్య బృందం తమ వంతు సహాయంగా మానవత దృక్పథంతో కొంత ఆర్ధిక సహాయం అందించారు. అందించిన వారిలో హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ జగదీష్, డాక్టర్స్,నర్సింగ్ సూపర్డెంట్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ నర్స్ కు ఆర్ధిక సహాయం చేసిన వైద్య బృందం.
Published On: December 16, 2023 5:20 pm