శ్రీ లక్ష్మీ నరసింహ వెల్డింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అన్నదానం
వెంకటాపూర్, డిసెంబర్02, తెలంగాణ జ్యోతి : మండలం లోని పాలంపేట గ్రామ ప్రభుత్వ భూమిలో జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేసుకొని శాంతియుత దీక్ష చేస్తున్న పాత్రికేయులకు శనివారం మండలంలోని నల్లగుంట గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ వెల్డింగ్ వర్క్స్ యజమాని వెలిషోజు ప్రేమ్ సాగర్ -లత దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. పాలంపేట గ్రామంలో శాంతియుత దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు వారు మద్దతు ప్రకటిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడా రు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసే జర్నలిస్టుల సేవలను గుర్తించా లని అన్నారు. ప్రతీ జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు ఇప్పించడం కోసం తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బేతి సతీష్,ఒద్దుల మురళి, రంగిశెట్టి రాజేందర్, దండెపల్లి సారంగం, ఎనగందులశంకర్, మునిగాల రాజు,తీగల యుగంధర్, ఎండి రఫీ, మామిడిశెట్టి ధర్మ, కందికొండఅశోక్ తదితరులు పాల్గొన్నారు.