వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ములుగు జిల్లా నూగురు వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో మండలం లొని నూగురు క్రాస్ రోడ్ వద్ద మంగళవారం సాయంత్రం విస్తృతంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, మరియు ఆధారం లేని నగదు, మద్యం అక్రమ రవాణా, నిషేదిత ఇతర సామాగ్రిని, వాహనాల్లో,రియు ఇతర పద్ధతిలొ తరలించడం నేరమని, ఇంధన శకట ధారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు, పేరూరు, వెంకటాపురం, ఆలు బాక పోలీస్ అవుట్ పోస్టు తదితర రక్షకబట నిలయాలను, సిబ్బందిని, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి, విస్తృతంగా తనిఖీలతో, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు, ఉన్నతాధికారుల ఆదేశంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వెంకటాపురం సి.ఐ బి. కుమార్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది వాహనాల తనిఖీల కార్యక్రమంలో పాల్గొన్నారు.
1 thought on “వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు. ”