విద్యార్థుల హజరుశాతం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

విద్యార్థుల హజరుశాతం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

– అదనపు కలెక్టర్ రెవిన్యూ డి. వేణుగోపాల్ 

వెంకటాపురం, డిసెంబర్12, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం మండలం లోని అలుబాక, తిప్పాపురం ముత్తారంలోని పోలింగ్ స్టేషన్లను మంగళవారం అదనపు కలెక్టర్ రెవిన్యూ డి. వేణుగోపాల్ సందర్శించారు. అనంతరం జడ్పీహెచ్‌ఎస్‌ ఆలుబాక లో విద్యార్థుల కు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం పై ప్రత్యేక దృష్టి పెట్టి తల్లిదండ్రులను సంప్రదించా లని, సరైన కారణాలు తెలుసుకొని విద్యార్థులు ప్రతిరోజు పాఠశాల కు క్రమం తప్పకుండా వచ్చే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment