వాజేడు మండలంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం…
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వాజేడు మండలం పాత అయ్యవారిపేట శివాలయం గుడి సమీపంలో కొంతమంది గుప్తనిధులు కోసం త్రవ్వకాలు జరిపి, క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. శుక్రవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు శివాలయం సమీపంలో గుప్తనిధుల కోసం ఆరడుగుల గుంత తవ్వి క్షుద్రపూజలు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా రాత్రి సమయంలో క్షుద్ర పూజలకు ఉపయోగించే పూజాసామగ్రి భారీ ఎత్తున ఉండడంతో గ్రామప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై పోలీస్ శాఖ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.