వాజేడులో ఎమ్మెల్యే పోదెం పర్యటన
తెలంగాణ జ్యోతి, వెంకటాపురం నూగూరు ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలంలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో అనుసరించాలిసిన వ్యూహాలహలపై కాంగ్రెస్ నాయకులతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదని వారు దోచుకోవడమే సరిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను టిఆర్ఎస్ ప్రభుత్వం కాపీ కొట్టి ప్రజల్లోకి తీసుకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ చెక్కు చెదరకపోవడం, బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు సంవత్సరం గడవకముందే కూలిపోయి పరిస్థితి ఏర్పడిందని టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని చెప్పుకుంటూ వారికి చేసింది ఏమీ లేదని రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఎటువంటి అపోహాలు నమ్మవద్దని హస్తం గుర్తుకు ఓటు వేసి తనను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.