రోడ్డు ప్రమాదంలో వైస్ ఎంపీపీ భర్త మృతి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం సరిహద్దు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహాదేవపూర్ వైస్ ఎంపీపీ బండం పుష్పలత భర్త భండం లక్ష్మారెడ్డి మృతి చెందారు. ఈ సంఘటనకు సంబదించిన వివరాలు.. బండం లక్ష్మారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరులో కుటుంబ సంబ్యులకు చెందిన వివాహ నిశ్చితార్థానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా, భూపాలపల్లి – కాటారం మార్గమధ్యంలో కమలాపూర్ అడ్డరోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వైస్ ఎంపీపీ భర్త బండం లక్ష్మారెడ్డి (54) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పెద్దపెల్లి జడ్పీ చైర్మన్, మంథని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్, బీఎస్పీ అభ్యర్థి చల్ల నారాయణరెడ్డి వేరువేరుగా సందర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
1 thought on “రోడ్డు ప్రమాదంలో వైస్ ఎంపీపీ భర్త మృతి”