రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డిని విమర్శేస్తే సహించేది లేదు
- బహిరంగ చర్చకు రావాలని డిమాండ్
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి విమర్శేస్తే సహించేది లేదు అని ములుగు నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి నెమలి బాలకృష్ణ హెచ్చరించారు. ములుగు మండలం దేవగిరిపట్నం వెళ్లిన ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఈ గ్రామానికి చెందిన సతీష్ రెడ్డి సంగతి చూస్తాను అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో నిన్నటి ములుగు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో రెడ్ కో చైర్మన్ వై.సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. నన్ను స్థానిక ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడుతుంది. నా సంగతి చూస్తాను అంటే ఏమి చేస్తుంది చంపుతుందా… నేను ఏమైనా తప్పు చేస్తున్ననా..నన్ను చంపితే చావుకు కూడా బయపడను అని మాట్లాడారు. దానికి ఈరోజు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా సిగ్గుందా…ఖబడ్దార్…. అని మాట్లాడడం సబబు కాదని ములుగు నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి నెమలి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్లిన సీతక్క మాట్లాడిందా లేదా అనే విషయంలో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రాజకీయాలు చేసేటప్పుడు హుందాగా చేయాలన్నారు. మానసికంగా బాధలు పెట్టడానికి రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తల్లి గురించి కుటుంబం ఓటు గురించి మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు.దేవగిరిపట్నంలో గత 2 సం.రాల నుండి జరిగిన అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని అని సవాల్ విసిరారు. మీరు చేస్తున్న వెకిలి చేష్టలకు ప్రజలు గమనిస్తున్నారని, నవంబర్ 30 వతేదీన ఓటుతో సరైన సమాధానం చెప్తారన్నారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవ్వడు బయపడరూ. ఇంకా ఈటువంటి రాతలు చేష్టలు మానుకోవాలని అన్నారు. లేని పక్షంలో గులాబీ దండు రంగంలోకి దిగితే ఎవ్వరు ఆపలేరని, మమ్మల్ని రెచ్చగొట్టొద్దన్నారు. ములుగులో కార్యకర్తలు, నాయకులు బడే నాగజ్యోతి గెలుపు కోసం పట్టుదలతో పని చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త గూడ సోషల్ మీడియా ఎన్నిక ఇంచార్జి వేల్పుల శ్రీకాంత్, మంగపేట సోషల్ మీడియా ఇంచార్జి బొల్లం శివ, ముడిగే రాజు కుమార్, ప్రభాకర్, దేవేందర్, అజిజ్,రాము గౌడ్, వేల్పుల బాబు, తల్లపెళ్లి శివ లు పాల్గొన్నారు.