రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. గెలిచేది జ్యోతక్కనే…
- డప్పు చప్పులు, కోలాటాల నడుమ నాగజ్యోతికి స్వాగతం
తెలంగాణ జ్యోతి ములుగు ప్రతినిధి : రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే గెలిచేది జ్యోతక్కనే అంటూ డప్పు చప్పులు, కోలాటాల నడుమ ములుగు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికి వెంకటాపూర్ మండలం గుంటూరుపల్లి, రామంజపూర్ గ్రామ మహిళలు, యువత, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసినటువంటి కుటుంబం మాది మా మార్గాలు వేరు మా లక్ష్యం ఒకటే ప్రజాసేవ అన్నారు. ఈ రోజున నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే నా ఒక్కదానికి వచ్చినట్టు కాదు ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అందరికీ వచ్చినట్టన్నారు. చతిస్గడ్ లో ఎన్నో వేల కోట్ల కాంట్రాక్టులు చేసి అక్కడి పైసలు తీసుకొచ్చి స్థానిక ఎమ్మెల్యే ధనసరి అనసూయ ఇక్కడ ఖర్చు పెడుతుందన్నారు. లీడర్లకు కార్యకర్తలకు తాగిపిచ్చుకుంటూ… డబ్బు వెదజల్లుతూ వాళ్ళ ఆరోగ్యలతో చెలగాటమాడు తుందన్నారు. పచ్చకామర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే అన్నట్టు ఆమె చేసుకుంటూ పక్కవారి మీద చెప్తుందని, ఎవరేంటో దయచేసి అందరూ ఆలోచించాలన్నారు. మన ఊర్లో కెసిఆర్ సిసి రోడ్లు గాని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రైతులకు 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకాలను పెట్టి పేదవారిని ఆదుకున్న వ్యక్తి మన కేసీఆర్ కాదా అని గుర్తు చేశారు. వ్యవసాయం మీద అవగాహన లేని రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేల్చుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పెట్టుబడి సాయం చేద్దామని ఏ ఒక్క రోజు ఆలోచించని పార్టీ ఇప్పుడు చేస్తది అంటే నమ్ముదామా, అలాంటి పార్టీ మనకు అవసరమా, 24 గంటల కరెంటును మూడు గంటల కరెంటుగా మారుస్తామంటున్న రేవంత్ రెడ్డి మాటలను నమ్ముదాము అని ప్రశ్నించారు. మన ఇంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఇన్చార్జి సాంబారు సమ్మారావు, మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పిన్నింటి రవీందర్ రెడ్డి, జడ్పిటిసి, ఎంపీపీ, గ్రామాల అధ్యక్షులు వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.