రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే పోదాం వీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ, వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ఇన్చార్జీలు కార్యకర్తలు సోమవారం రాత్రి ఎన్నికల నియమ నిబంధనల టైం ప్రకారం ప్రచారాన్ని నిర్వహించారు. వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు, కూలీలు అన్ని వర్గాల ప్రజలు పొద్దుపోయిన తర్వాత గ్రామాలకు చేరుకోవడంతో, ఎన్నికల ప్రచార కాంగ్రెస్ కమిటీ ల నాయకులు ఆయా గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. పంచాయితీల గ్రామాల కమిటీలు ప్రచారం ఇన్చార్జీలు, ఎన్నికల ప్రచార మెటీరియల్, కరపత్రాలను ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లకు అందజేసి ప్రస్తుత ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పీ.వీ రయ్య హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లకు గ్రామస్తులకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం కరపత్రాల ను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ల పథకం, చేవెళ్ల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇతర సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరటంతో, వారందరికీ కండువాలు తో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఎన్నికల ప్రచార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో ,రాచపల్లి, ఆలుబాక, వెంకటాపురం, మరికాల, ఉప్పెడువీరాపురం, వీఆర్కే పురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార నినాదాలు, కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కి జేజేలు తో ప్రచారం హోరెత్తించింది.