ములుగు జిల్లాలో బీఎస్పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
– ఘట్టమ్మను దర్శించుకున్న బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జంపన్న నాయక్, జిల్లా అధ్యక్షులు శనిగరపు మహేష్ ఆధ్వర్యంలో మహమ్మద్ గౌస్ పల్లి నుండి మేడారం వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జంపన్న నాయక్ మాట్లాడుతూ ముందుగా ఘట్టమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నానని, నియోజకవర్గ అభివృద్ధికై బాటలు వేస్తానని, రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రహదారులు నిర్మించి, యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చూస్తానన్నారు. ఏటూరునాగారం హాస్పటల్ ను 100 పడకల హాస్పిటల్ గా మార్చి కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తానన్నారు. జిల్లాకు సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం ఏర్పాటయ్యేల, లక్ష్మీదేవి పేట, రాజుపేట మండలాల ఏర్పాటు కృషి చేస్తానన్నారు. రాజ్యాంగబద్ధంగా గిరిజన, గిరిజనేతర్లకు పోడు భూములు, అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేస్తానన్నారు.అదేవిధంగా ఏటూరునాగారం లో బస్ డిపో, వరద ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఈ ప్రాంత గిరిజన బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జిలు, మహిళా కన్వీనర్లు, బీఎస్పీ జిల్లా నాయకులు, వివిధ మండలాల కమిటీ అధ్యక్షులు,బూత్ కమిటీ అధ్యక్షులు, మహిళలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులతోపాటు తదితరులు పాల్గొన్నారు.