Seetakka | ములుగులో సీతక్క గెలుపు
– జయహో సీతక్క అన్న ప్రజానికం
– 33 వేల 700 మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి పై ఘన విజయం
ములుగు ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సిట్టింగ్ అభ్యర్థి ధనసరి అనసూయ (సీతక్క) విజయం సాధించారు. ఆదివారం జరిగిన కౌంటింగ్లో టిఆర్ఎస్ అభ్యర్థి ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పై 33 వేల 700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 1,85,000 ఓట్లు పోలు అవ్వగా 22 రౌండ్ల లెక్కింపును ఎన్నికల అధికారులు చేపట్టారు. ఎమ్మెల్యే సీతక్క గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. బాణాసంచాలు పేల్చితూ స్వీట్లు పంపిణీ చేశారు. తన గెలుపుకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.