ములుగులో పోటీ చేసేది సీతక్క కాదు.. ఢిల్లీ నేతలు…
- ఆదివాసి బిడ్డ పోటీ చేస్తే ఇంత అక్కసా…?
తెలంగాణ జ్యోతి ములుగు ప్రతినిధి : ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేది ధనసరి అనసూయ కాదని, ప్రియాంక, రాహుల్ గాంధీలే నని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ఒక ఆదివాసి బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఓర్వలేక ఢిల్లీ నుంచి ప్రియాంక, రాహుల్ గాంధీ లను పిలిపించి మరీ సీతక్క సభ పెట్టించిందని అన్నారు. ఛత్తీస్గడ్లో వేల వేల కోట్లు దోచుకుని వాటిని తెలంగాణలోని 30 నియోజకవర్గాలకు డబ్బు సంచులను పంపిణీ చేస్తోoదని అన్నారు. ఆమె నిజమైన ఆదివాసి బిడ్డ కాదని..గిరిజన దొరసాని అని అన్నారు. మంగళవారం పొట్లాపూర్ పత్తిపల్లి, చింతకుంట, చింతలపల్లి, చిన్న గుంటూరు పల్లి, కోడిశాల కుంట తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమె ములుగు ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. వేల కోట్లు సంపాదించి నియోజకవర్గంలో వెదజల్లుతుందని ఆరోపించారు. ఆమె దగ్గర పని చేస్తున్న పీఏ లకే 10 కోట్లు 20 కోట్ల విలువైన ఇండ్లు ఉన్నాయని ఆమె అన్నారు.అవినీతి సొమ్ముతో ఈ ప్రాంత యువతకు తాగించి వారి ఆరోగ్యం పాడయ్యే విధంగా కాంగ్రెస్ నేతల చర్యలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీకి గులాములుగా మారి ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకపోగా.. ప్రశ్నించే గొంతుక అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తుంటే అనసూయ మాత్రం రైతులకు ఉచిత కరెంటు ఎందుకని మాట్లాడుతున్నారని అన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు మన నాశనం మనమే కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు. మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు వెల్లడించారు. పొ ట్లాపూర్ గ్రామంలో అన్ని వీధులకు సీసీ రోడ్లు వేయడంతో పాటు గోదావరి నీళ్లతో ఈ ప్రాంత భూములు సస్యశ్యామలమయ్యే విధంగా కృషి చేస్తానని అన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే రైతుబంధు పెన్షన్లు పెంచు కోవడంతోపాటు సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇంటింటికి మహిళలకు 3000 రూపాయలు అందివనున్నట్లు చెప్పారు.టీఎస్ రెడ్ కో చైర్మన్, ములుగు ఎన్నికల ఇంచార్జ్ ఏరువ సతీష్ రెడ్డి మాట్లాడుతూ… ఉచిత కరెంటు వద్దంటున్న కాంగ్రెస్ పార్టీని రైతులు తరిమికొట్టాలని మండిపడ్డారు. రైతు బంధు వద్దంటూ కాంగ్రెస్ నేతలు ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని, రైతులను చులకనగా చూసే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. రామప్ప పాకాల నుండి వచ్చే నీటిని పొట్లాపూర్ గ్రామానికి మళ్ళించి ఈ ప్రాంత భూములు సస్యశ్యామలం అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. పొ ట్లాపూర్, పత్తిపల్లి గ్రామాల్లో పక్కా ఇల్లు, ప్రతి వీధికి సిసి రోడ్డు వేయించే విధంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.