మీ బిడ్డగా వస్తున్నా ఆశీర్వదించండి : బడే నాగజ్యోతి
- బీఆర్ఎస్ తోనే మరిన్ని సంక్షేమ పథకాలు
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మీ బిడ్డగా వస్తున్న ఆదరించి నాకు ఓటు వేసి ఆశీర్వదించండి అని ములుగు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. కన్నాయిగూడెం మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం నిర్వహించిన ఆమె కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈమేరుకు ఆమె కన్నాయిగూడెం మండలంలోని సర్వాయి, ఐలాపూర్,భూపతి పూర్, సింగారం గ్రామాలలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఐలాపూర్ గ్రామంలోని సమ్మక్క ఆలయంలో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ తోనే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు వస్తాయని,బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పాలన దేశంలో మరెక్కడ లేదని,పది సంవత్సరాలలో ఎవ్వరు ఊహించనటువంటి జనరంజకమైన పాలన, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టారని,ఈపదేళ్ళ కాలంలో గత ప్రభుత్వాలలో ఎన్నడూ చూడని విప్లవాత్మకమైన మార్పులు తెలంగాణ ప్రజలు చూశారని ఆమె అన్నారు.నాటికి నేటికి గ్రామాలను పోల్చుకుని చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది అని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య,జిల్లా రైతు బందు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య,చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.