మిచాంగ్ తుఫాన్ తో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
– కాంగ్రెస్ మండల పార్టీ చిటమట రఘు
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండలలో మిచాంగ్ తుఫాన్ తో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు అన్నారు. అకాల వర్షాల వల్ల వరి మిర్చి పంటలు దెబ్బతిన్నాయని, చేతికి వచ్చిన వరి పంట ఈదురు గాలులకు నేల మీద పడిపోందని,మిర్చి తోట లలో వర్షపు నీరు నిల్వ డంతో మీర్చి తోటలు దెబ్బ తిన్నా యని, కల్లాలలో ఉన్న వడ్లు వర్షానికి తడిచి మొలకలు వచ్చాయని అన్నా రు. అగ్రికల్చర్, రెవెన్యూ అధికారులతో నష్టపోయిన పంటల ను సర్వే చేయించి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవా లని అధికారులను ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి ఖలీల్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్,ఎస్టీ సెల్ మండల అద్యక్షుడు చేల వినయ్, తదితరులు పాల్గొన్నారు.