మధ్యం అకమ్ర రవాణాకు చెక్‌

మధ్యం అకమ్ర రవాణాకు చెక్‌

  • అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాల ఎక్సయిజ్‌ అధికారుల భేటి
  • సమన్వయ సమావేశంలో నిర్ణయం
  • పాల్గొన్న మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల అధికారులు
  • ఎన్నికల దృష్ట్యా ముమ్మర తనఖీలకు ప్రణాళిక

ములుగు / భూపాలపల్లి ప్రతినిధి : ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల ప్రొహిబిషన్‌, ఎక్సయిజ్‌ అధికారి శ్రీనివాస్‌ అధ్యక్షతన ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌ కోఆర్డినేషన్‌ మీటింగ్‌ గురువారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంల ఓ మలుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర ఎక్సయిజ్‌ అధికారులు, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల ఎక్సయిజ్‌ అధికారులు పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో మధ్యం అక్రమ ర వాణా నిరోధానికి చేపట్టవలసిన ప్రణాళికను రూపొందించారు. సరిహద్దు ప్రాంతం గుండా నాటు సారాయి, అకమ్ర మధ్యం, మత్తు పదార్ధాల రవాణా నిరోధానికి తనకీలు ముమ్మరం చేయాలని, ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టాలని నిర్ణయించారు. పరస్పరం అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని నిర్ణయించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల ఎక్సయిజ్‌ అధికారి వి. శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్‌ ఎం. లింగాచారి, ఏటూరునాగారం ఎక్సయిజ్‌ సీఐ ఫకీరా, కాటారం ఎక్సయిజ్‌ సీఐ ఎం .ప్రశాంతి, డీటిఎప్‌ సీఐ రాజసమ్మయ్య, ఏటూరు నాగారం ఎక్సయిజ్‌ ఎస్‌ . వెంకన్న చందు, మహారాష్ట్ర ఎక్సయిజ్‌ అధికారులు బి. బిషేక్‌, వి. భగత్‌, పి గోజీబీ, చత్తీస్‌ఘడ్‌ ఎక్సయిజ్‌ అధికారి వతన్‌ చౌదరి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “మధ్యం అకమ్ర రవాణాకు చెక్‌”

Leave a comment