మంత్రి సీతక్కను కలిసిన వాజేడు కాంగ్రెస్ నాయకులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది: ములుగు జిల్లా వాజేడు మండలం కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులో మంగళవారం ములుగు నియోజకవర్గంలో ఘన విజయం సాధించి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్కను నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలం నియోజకవర్గం లో ఉన్న ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని అనేక సమస్యలు నెలకొని వున్నాయని మంత్రి కి విన్నవించి దశల వారీగా పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రోడ్లు, సాగునీటి వనరులు, ఇంకా అభివృద్ధి సంక్షేమ పథకాలు మంజూరు చేసి మారుమూల గిరిజన ప్రాంతాలైన వెంకటాపురం, వాజేడు రెండు మండలాలకు మంజూరు చేసి, గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. వాజేడు కాంగ్రెస్ నాయకులు పలిశెట్టి శ్రీనివాస్, బంధం కృష్ణ, కాలేశ్వరం సర్వేశ్వరరావు, గగ్గూరి అశోక్ , వెంకటేశ్వర్లు, తుండి రాజబాబు, బచ్చు రాముగుప్తా తదతరులు పాల్గొన్నారు.