మండల పరిషత్ కార్యాలయంలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శుక్రవారం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. భద్రాచలం ఎస్టి రిజర్వేషన్ 119 అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నోటిఫికేషన్లో నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, ఇతర అంశాల తో కూడిన అధికారిక నోటీస్ ను బోర్డ్ లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల అదికారి ఉన్నతాధికారుల ఆదేశంపై విడుదల చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాబు వెంకటాపురంలో మీడియాకు విడుదల చేసిన ఎన్నికల అధికారిక ప్రకటనలో తెలిపారు.
1 thought on “మండల పరిషత్ కార్యాలయంలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల.. ”