భద్రాచలం సి. పి ఎం పార్టీ అభ్యర్థి కారం పుల్లయ్య విస్తృత ప్రచారం
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : భద్రాచలం నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి కారం పుల్లయ్య బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటాపురం మండలంలోని కొత్త గుంపు, తిప్పాపురం, కలిపాక, పెంకవాగు ,ముత్తారం, సీతారాంపురం, రామచంద్రాపురం, గ్రామాలలో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి కారం పుల్లయ్య ఇంటింటి ప్రచారం చేశారు. కారం పుల్లయ్య మాట్లాడుతూ గతంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిరిజన గ్రామాలలో ఏమి అభివృద్ధి చేయలేదని అన్నారు .అంతేకాకుండా ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసిన గిరిజన గ్రామాలు ఇంకా అభివృద్ధి కాలేదని ధ్వజమెత్తారు. ఈసారి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే గిరిజన ,గిరిజనేతరుల పక్షాన అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తి గిరిజన, గిరిజనేతరుల సమస్యలను పరిష్కరించడంలో, గ్రామాలకు నిధులు రాబట్టుటలో కృషిచేసి, గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తానని అన్నారు. అంతేకాకుండా గతంలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు అయినా కుంజా .బొజ్జి ,సున్నం .రాజయ్య వారి వారసుడిగా వచ్చానని వారి అడుగుజాడల్లో నడుస్తూ అన్ని గ్రామాల్లో అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు .మరియు తాను 20 సంవత్సరాల నుంచి భద్రాచలం నియోజకవర్గం లో అనేక ఉద్యమాలు చేశానని, పోలవరం కట్టొద్దని ఉద్యమాలు చేశానని అనేక పోరాటాలలో పాల్గొన్నానని తెలిపారు. గిరిజనులకు సాగు చేసుకునే భూములకు పట్టాలు ఇవ్వాలని, అనేక సందర్భాల్లో ఐటీడీఏ కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమాలలో పాల్గొన్నానని తెలిపారు. పేదల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజల మధ్యలో తిరిగే సిపిఎం పార్టీ అభ్యర్థిగా తనను ఆదరించాలని ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో సిపిఎం అభ్యర్థి కారం పుల్లయ్య ఓటర్లను కోరారు. అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజల మధ్యన ఉంటూ, ప్రజల కోసం నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న సిపిఎం పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిపిఎం కు అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేసుకోవటం కోసం నాకు ఒక చక్కటి అవకాశం కలుగుతుందని అన్నారు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి కూడా ఇల్లు కట్టించుటలో ,రోడ్లు వేయించుటలో వైద్య సౌకర్యం అందించుటలో, ఈ రెండు పార్టీలు ఏమి చేయలేదని ఆరోపించారు. గతంలో ,పనిచేసినటువంటి సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న కుంజా .బొజ్జి సున్నం రాజయ్యలు వారు చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనబడుతుందని అన్నారు. అందుకని సిపిఎం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే మీ మధ్యలో ఉంటూ మీకోసం అనేక అనేక సందర్భాల్లో మీ సమస్యలను పరిష్కరించుటలో ముందుండి నడిపిస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి.కృష్ణారెడ్డి, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు యలమంచిలి. రవికుమార్, సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల .వెంకటరెడ్డి ,మాజీ జడ్పిటిసి వంకా.రాములు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి .శ్రీను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండీ గఫూర్, సిపిఎం పార్టీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.