భద్రాచలం నియోజకవర్గం బిజెపికి బిగ్ షాక్ 

Written by telangana jyothi

Published on:

భద్రాచలం నియోజకవర్గం బిజెపికి బిగ్ షాక్ 

  • బిజెపి కి గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పదవికి రాజీనామా. 
  • వెంకటాపురం ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ ప్రకటన. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అయిన చెరుకూరు సతీష్ కుమార్ భారతీయ జనతా పార్టీకి, మరియు గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ఉదయం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా ఎంపీ పి మండల పరిషత్ అధ్యక్షులుగా పద వి లో వున్న చెరుకూరి సతీష్ కుమార్ రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలోకి మారారు. బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని ఆయన కల్పించారు. బిజెపి పార్టీ ని భద్రాచలం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మారుమూల అటవి గ్రామాల్లో ,ఆదివాసీ ప్రాంతాల్లో గత రెండేళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృతంగా పర్యటించేవారు. సొంత వాహనంలో తన కార్యకర్తలు తో గ్రామ, గ్రామాన కేంద్ర ప్రబుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి గ్రామాల్లో బిజెపి జెండాలు రెపరెపలాడే విధంగా పార్టీ కోసం అంకితభావంతో అహర్నిశలు పనిచేశారు. కాగా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి పార్టీ అభ్యర్థిగా వెంకటాపురం ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ పేరు పార్టీ అధిష్టాన వర్గం గతంలో పరిశీలన చేసి ఖరారు చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే టికెట్లు ఆశించే వారి ఆశావాహల్లో మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కూడా ఉన్నారు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యావతి గారు స్వర్గస్తులు అయ్యారు. పార్టీ అధిష్టానం పార్టీ టికెట్టు కేటాయింపులో వెంకటాపురం ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ పేరును తొలగించారు. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కుంజాసత్యవతి భర్త కుంజా ధర్మారావుకు భద్రాచలం నియోజకవర్గం బిజెపి పార్టి టికెట్ కేటాయించడంతో, తీవ్ర ఆగ్రహం , కలత చెందిన ఎంపీపీ సతీష్ కుమార్ బీజేపీ పార్టీకి రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు లిఖిత పూర్వ ప్రకటనలో శనివారం మీడియాకు విడుదల చేశారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ పై, తన కార్యకర్తలు, తన అభిమానులు తో సంప్రదించి సరైన నిర్ణయం తీసుకుంటామని, వెంకటాపురం మండల పరిషత్తు అధ్యక్షులు చెరుకూరి సతీష్ కుమార్ శనివారం ఉదయం విలేకరులకు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బానోత్ హుస్సేన్ మరియు రాష్ట్ర బిజెపి నాయకులకు పంపినట్లు ఆయన తెలిపారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now