భద్రాచలం నియోజకవర్గం ప్రజలకి దసరా శుభాకాంక్షలు.
- భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం.వెంకటరావు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గ ప్రజలకి దసరా పండుగ సంధర్భంగా బిఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ దసరా శుభాకాంక్షలు ప్రకటనను వెంకటాపురం, వాజేడు మండలాల టిఆర్ఎస్ నేతలు సోమవారం మీడియాకు విడుదల చేశారు. దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నాం అని డాక్టర్ అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని తెలిపారు. దసరా రోజున పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకును బంగారం లా పరస్పరం పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, ప్రేమాభిమానాలను చాటుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, వెంకట్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబం తో సహా, రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని డాక్టర్ తెల్లం.వెంకట్రావు తన విజయదశమి శుభాకాంక్షలు ప్రకటనలో ఆకాంక్షించారు.