బొల్లారంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం బొల్లారం గ్రామంలో మంగళవారం ఉదయం వాజేడు పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామము దట్టమైన అటవీ ప్రాంతానికి దగ్గర లో ఉన్నందున ఊర్లో గాని, పరిసర ప్రాంతాలలో గాని ఎవరైనా అనుమానితులు, కొత్త వ్యక్తులు కనిపించినట్లైతే వెంటనే పోలీస్ లకు సమాచారం అందించవలసిందిగా సూచించారు. అలాగే యువత ఉద్యోగ ఉపాధి రంగాలలో సన్మార్గం లో నడవాలని కోరారు. సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని, బంగారు భవిష్యత్ ను పాడు చేసుకోవద్దని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమము లో వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, 39 బిఎన్జీ కంపెనీ డిఎస్ఫి (అసిస్టెంట్ కమాండెంట్) శ్రీ అనిస్ , వాజేడు సివిల్ అండ్ సిఆర్ పిఎఫ్ పేరూర్ సిబ్బంది పాల్గొన్నారు.