బిజెపిలో పలువురు చేరిక
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో పలువురు చేరారు. కాటారం మండలం దేవరాపల్లి , దంతాల పల్లి గ్రామాల్లోని యువకులు బోనాల మహేష్, అంతటి దేవేందర్, చెన్నూరు అశోక్ తో సహా 50 మంది యువకులకు కండువా కప్పి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పర్తిరెడ్డి హనుమయ్య, మండల ప్రధాన కార్యదర్శి పూసాల రాజేంద్రప్రసాద్, రేగులగూడెం సర్పంచ్ దోమ రాహుల్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు జిల్లాల శ్రీశైలం, మండల యువ మోర్చా అధ్యక్షులు బొడ్డు శివ తదితరులు పాల్గొన్నారు.