బిఎస్పి అభ్యర్థిగా చల్లా నామినేషన్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంథని శాసనసభ నియోజకవర్గం నుంచి చల్లా నారాయణరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మంథని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కౌంటర్లో చల్లా నారాయణరెడ్డి తరఫున ఆయన సతీమణి మాజీ ఎంపీపీ చల్లా సుజాత ఒక సెట్టు నామినేషన్ ను దాఖలు చేశారు. అలాగే చల్లా నారాయణరెడ్డి ఆర్డిఓ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి హనుమా నాయక్ కు నామినేషన్ దాఖలు పత్రాలను సమర్పించారు. ఆయన వెంట కాటారం మాజీ జెడ్పిటిసి దుర్గం మల్లయ్య తదితరులు ఉన్నారు.
1 thought on “బిఎస్పి అభ్యర్థిగా చల్లా నామినేషన్”