బిఆర్ ఎస్ పార్టీలో భారీగా చేరికలు
తెలంగాణ జ్యోతి , కాటారం ప్రతినిధి: భారత రాష్ట్ర సమితి పార్టీ కాటారం మండల కార్యదర్శి జోడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ అభ్యర్థి పుట్ట మధు సమక్షంలో పలువురు భారీగా చేరికలు జరిగాయి. జోడు సత్యం, నాయిని సమ్మయ్య, జోడు రాజు, జోడు మధుకర్, నాయిని నాగరాజ్, సుమన్, దోమల రాజబాబు, కుసుమ సతీష్, పోతుల వెంకటేష్, నాయక్, శేఖర్, గడిచేర్ల రాహుల్, గడిచేర్ల హరీష్ తదితరులతో పాటు సుమారు 50 మంది బీ ఆర్ ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తోట జనార్ధన్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు రామిల్ల కిరణ్, పంతకాని సడవలి, సడవలి, వెంకటస్వామి, ముక్తి తిరుపతి, మారపాక రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.