బిఆర్ఎస్ లో చేరిన బిజెపి జిల్లా నేత గోనే రాజిరెడ్డి
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం మండలం దామరకుంట గ్రామానికి చెందిన బిజెపి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గోనె రాజిరెడ్డి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. గోనె రాజిరెడ్డికి మంథని శాసనసభ నియోజక వర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ మంథని నియోజక వర్గం అభ్యర్థి పుట్ట మధు గెలుపునకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంతోషం శ్రీనివాస్ రెడ్డి, పుట్ట ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.