బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అడుగడుగునా నిరాజనాలు.
- కారు గెలవాలి కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి.
- తెలంగాణ ఉద్యమకారుడు తిప్పనపల్లి సిద్దులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ప్రజా సంక్షేమ పథకాలల్లో దేశంలోనే ఆదర్శంగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో, ప్రతి కుటుంబంలో లబ్ధిదారులు ఉన్నారని, ప్రతిపక్షాలు ఎన్నికలప్రచారంలో కల్లబొల్లి మాటలు చెప్పినా ప్రజా ఆశిర్వాదంతో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని, భద్రాచలం నియోజకవర్గంలో కారు గుర్తు ఘనవిజయం సాధించే విధంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ నేత తిప్పనపల్లి సిద్ధులు అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో బుధవారం ఉద్యమకారుడు తిప్పనపల్లి సిద్దులు ముఖ్య కార్యకర్తలు, నాయకులు తో సీనియర్ నాయకులు చిడెం రవి స్వగృహంలో సమావేశం అఇ మాట్లాడారు. ఈ సందర్భంగా జరగనున్న ఎన్నికల్లో పార్టీ ప్రచార సరళి, కార్యకర్తల విధి విధానాలు, ప్రచారం తదితర అంశాలపై నాయకులతో కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఉద్యమకారులు తిప్పనపల్లి సిద్దులు టిఆర్ఎస్ నాయకులు సంయుక్తంగా సీనియర్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లి కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్న విధానాలను ప్రజలంతా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు ను గెలిపించుకొని భద్రాద్రి రాముడు కి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల హర్షాతిరేకాలు మధ్య ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణా లో దేశంలో ఎక్కడ లేని విధంగా దళితులను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు, ధలితబందు పథకం, రైతుల కొరకు రైతుబందు, రైతు భీమా మరియు పేదింటి ఆడ కళ్యాణ లక్ష్మీ , శాధిముభారాక్ ,ఇంకా అనేక సంక్షేమ పదకాలు అమలు చేస్తున్న ఏకైక కెసిఆర్ ప్రభుత్యం అని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఆశీస్సులతో భద్రాచలం నియోజకవర్గం పార్టీ అభ్యర్ది డాక్టర్ తెల్లం వెంకటరావు పోటీ చేస్తున్నారని, వారిని గెలిపిoచుట ద్వారానే భద్రాచలం నియోజకవర్గ ంఅభివృద్ధి సాధ్యం అవుతుoదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత రెండు పర్యాయాలు భద్రాచలం నియోజకవర్గ లో ఎంఎల్ఎలు గెలిచినా వారు ఏనాడు ప్రజల సమస్యలను తీర్చింది లేదని ఎద్దేవాచేశారు. భద్రాచలం నియోజకవర్గ పార్టీ అభార్దిగా పోటీ చేస్తున్న డాక్టర్ తెల్లం వెంకటరావు గారిని గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి అవుతుందని అన్నారు. ఓటర్లు ప్రజలు ఆలోచింఛి కారు గుర్తు పై ఓటు వేసి బంగారు తెలంగాణ ఏర్పాటులో బాగస్వాములు కావాలని ఉద్యమనేత తిప్పనపల్లి సిద్దులు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు ,వెంకటాపురం వాజేడు మండలాల కొ-కన్వీనర్ గూడవర్తి నరసింహ మూర్తి , మండల కార్యదర్శి . మురళి , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు న్యాయవాధి చిడెం రవి కుమార్ ,సీనియర్ నాయకులు లక్ష్మినారాయణ,శివాజీ తదితరులు పాల్గొన్నారు.అనంతరం పార్టీలో అనేకమంది మండల కేంద్రానికి చెందిన యువకులు పార్టీ లో చేరగా వారందరికీ గులాబీ కండవాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ప్రతి కార్యకర్త, నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రతిరోజు, ప్రతి గంట ఆయా సమయాలను వృధా చేయకుండా పార్టీ సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించి, కారు గుర్తుకు ఓటు వేసే విధంగా ఎన్నికల రణ రంగంలో సమర శంఖం గట్టిగా పూరిస్తూ సైనికులుగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు కు ఉద్యమ నేత తిప్పనపల్లి సిద్ధులు పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు తిప్పన పల్లీ సిద్ధులు వెంకటాపురం రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతి నిదుల్లో నూతన ఉత్సాహం తో, ప్రచార కార్యక్రమాల్లో దూసుకు పోతామని ఈ సందర్భంగా తెలిపారు.