ప్రభుత్వ పథకాలే గెలుపుకి శ్రీ రామరక్ష
-నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బడే నాగజ్యోతి
తెలంగాణ జ్యోతి, మంగపేట ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ములుగు బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ప్రచార వస్త్రాలుగా తీసుకుని నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తొలిసారిగా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం రావడంతో తమ గెలుపును కేసీఆర్ కి గిఫ్ట్ ఇస్తా అంటూ గ్రామాల్లో ప్రచారాలు చేస్తూ గెలుపు వైపు పరుగులు పెడుతున్నారు. అదేవిధంగా బడే నాగ జ్యోతి ఎక్కడికి వెళ్ళిన లబ్దిదారులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఒక వైపు బిఆర్ ఎస్ పార్టీవి కేవలం ప్రజా ఆకర్షణ పథకాలని విపక్షాలు ప్రచారం చేస్తున్నప్పటికి లబ్దిదారుల్లో మాత్రం నాగజ్యోతిని గెలిపించాలన్న తాపత్రయం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. దళిత బంధు, ఆసరా పెన్షన్లు, బీసీ బంధు, రైతు బంధు ఇలాంటి ఎన్నో పథకాలు ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చాయని ప్రజల నుంచి వినవస్తున్నాయి. 2014 లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వచ్చిన అనేక మార్పులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ముఖ్యంగా కరెంటు లేక రైతన్నలు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదని, బిఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పగ్గాలు చేపట్టిన వెంటనే మొట్టమొదటి సారిగా కరెంటు సమస్యను పరిష్కరించిన ఘనత ఆయనకే దక్కింది. లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోయిన సంఘటనలను చూసాం. ఉచిత కరెంటు లేక అన్నదాతలు అనేక ఇబ్బందులు పడ్డారు. అనంతరం 24 గంటలు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడగలిగాము. దివ్యాంగుల పెన్షన్లు మూడు పర్యాయాలు పెంచి సమాజంలో వారికి ఒక సముచిత స్థానాన్ని కల్పించిన ఘనత కూడా టిఆర్ ఎస్ ప్రభుత్వానిదే తమ కుమార్తె వివాహానికి ఆర్థిక స్తోమత లేక అనేక మంది తల్లిదండ్రులు పడ్డ అవస్థలను ముఖ్యమంత్రి స్వయంగా గమనించి వివాహ ఖర్చుల నిమిత్తం లక్ష నూట 16 రూపాయలు అందజేయడం సామాన్య విషయం కాదు.
- కేసీఆర్ భరోసా పథకాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌పై భరోసా,అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత, అగ్రవర్ణ పేదలకు 119 గురుకులాలు, స్వశక్తి మహిళా గ్రూపులకు సొంత భవనాలు, హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆరోగ్య శ్రీ 15 లక్షలకు పెంపు, పేద మహిళలకు 400కే గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి, రైతుబంధు 16 వేలకు పెంపు, దివ్యాంగుల పెన్షన్లు రూ.6వేలకు పెంపు, ఆసరా పెన్షన్లు రూ.5వేలకు పెంపు, తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు సన్నబియ్యం, రైతుబీమా తరహాలో ప్రజలందరికీ ఉచిత బీమా, మైనారిటీలకు మరిన్ని అవకాశాలతో పాటు మరి పథకాలు అమలు చేయనున్నట్లు వివరిస్తున్నారు.
1 thought on “ప్రభుత్వ పథకాలే గెలుపుకి శ్రీ రామరక్ష”