పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాస్ట్ పుడ్ సెంటర్లను నియంత్రించాలి.
- బి ఎస్ పి. సోషల్ మీడియా అధ్యక్షుడు జనగాం కేశవరావు
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : గత కొన్నేళ్లుగా ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంతో పాటు మండలం లోని జగన్నాధపురం,గుమ్మడిదొడ్డి,వాజేడు, చెరుకూరు, ధర్మారం, పేరూరు గ్రామాల్లో ఇస్టనుసారంగా ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, టిపిన్ సెంటర్ లు, బిర్యానీ పాయింట్ లు, పాస్ట్ పుడ్ సెంటర్ లు, నిర్వహిస్తు ధర తక్కువ లొ వచ్చే ఏదో గుర్తు తెలియని ఇతర రాష్టాల్లో బ్యాన్ సేసిన వంటనూనె వాడుతు న్నారని బిఎస్పి సోషల్ మీడియా నేత జనగాం కేశవరావు సోమవారం ఒకప్రకటనలో ఆరోపీంచారు. పిండి పదార్ధాలు, ప్రీజ్ లలో నిల్వ ఉంచిన మాంసాహారం, పచ్చళ్ళు, చెట్నీ లు ఉపయోగి స్తున్నారని ,ప్రజల ప్రాణాలతో చలగటం ఆడుతున్నారని ,అందులో భాగంగానే మద్యం వ్యాపారం కూడా జోరుగా చేస్తున్నారని తెలిపారు. టిఫిన్ సెంటర్ ల ముసుగులో బెల్ట్ షాప్ లను నిర్వహిస్తున్నారని ఇది పూర్తి గా ఐదవ షెడ్యూల్ ప్రాంతం అయినప్పటికీ ఆదివాసీలా పొట్టగొట్టి, చట్టాలను కాలరాసి ఎక్కువ గా గిరిజనేతరులే ఈ వ్యాపారాలను చేస్తున్నారని,ఆరోపించారు. అమాయకపు ఆదివాసీ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నార ని బిఎస్పీ నేత జనగాం కేశవరావు ఆవేదన వెక్తం సేసారు. ఇంత జరుగుతున్న జిల్లా పుడ్ ఇన్స్పెక్టర్ గాని ఎక్సైజ్ శాఖ అధికారులు గాని నిమ్ముకు నీరెత్తనట్టు వ్యవరస్తున్నారని ఆయన అన్నారు., వెంటనే ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యక చొరవ తీసుకొని అనుమతులు లేకుండా టిపిన్ సెంటర్ లు, బిర్యానీ పాయింట్ లు, పాస్ట్ పుడ్ సెంటర్ లు నిర్వహిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసువాలని అన్నారు, లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి , రాష్ట్రమంతటా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని, భద్రాచలం నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షుడు జనగాం కేశవరావు తెలియజేశారు .
1 thought on “పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పాస్ట్ పుడ్ సెంటర్లను నియంత్రించాలి. ”