పదేండ్ల రాక్షస పాలనకు విముక్తి : జిల్లా అధ్యక్షుడు అశోక్ 

Written by telangana jyothi

Published on:

పదేండ్ల రాక్షస పాలనకు విముక్తి : జిల్లా అధ్యక్షుడు అశోక్ 

ములుగు, డిసెంబర్11, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నిత్యం అభివృద్ధి పథంలో నిలిచేలా ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క అహర్నిశలు కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ములుగు జిల్లా అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మంత్రి సీతక్క అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొందని అన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ములుగు జిల్లా ఏర్పాటుకు, మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్, మల్లంపల్లి మండలం, గిరిజన యూనివర్సిటి ఇలా అన్ని రకాల అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో శ్రమించారని అన్నారు. కరోనా సమయంలో అడివిలో తిరుగుతూ ఆకలికి అలమటించే వారికి అమ్మగా నిలిచి ప్రజాసేవే తన లక్ష్యమ ని ముందుకు సాగిందన్నారు. ఎన్నికల ముందు డబ్బుల సంచుల తో ములుగు నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి కోట్లు దండుకోవా లని ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ప్రజలు కేసిఆర్ ను నమ్మ లేదన్నారు. ములుగు నియోజక వర్గ ప్రజలు డబ్బు సంచులకు అమ్ముడుపోయే తత్వం కాదని, పోరాడే పోరాట పటిమ గలవారని నియోజకవర్గ ప్రజలు నిరూపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకు దూసుకు పోతుందని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలలో ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చడం జరిగిందని తెలిపారు. ఇంకా మిగిలిన హామీలను కూడా 100 రోజుల లోపే నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టు కుంటామని అన్నారు. అంతేకాకుండా ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ ను ప్రజాభవంగా మార్చి గడీల పాలన, రాచరిక పాలన అంతంచేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని నిరూపించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజకవర్గంలో గెలవడానికి కారణమైన జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి,నాయకులకు, కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు చాంద్ పాషా, జిల్లా అధికార ప్రతినిధి సర్పంచ్ అహ్మద్ పాషా, ములుగు టౌన్ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి, జిల్లా కార్యదర్శి యాసం రవికుమార్, ఎంపిటిసి మావురపు తిరుపతిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ రఘు,పల్లె జయపాల్ రెడ్డి, బిసీ సెల్ మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్, ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్ కుమార్, మైనారిటీ సెల్ నాయకుడు కుత్బుద్దీన్, వెంకటాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, మంగపేట మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, రమేష్ యాదవ్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు కంబాల రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “పదేండ్ల రాక్షస పాలనకు విముక్తి : జిల్లా అధ్యక్షుడు అశోక్ ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now