నూగూరు వద్ద విస్తృతంగా వాహనాలు తనిఖీలు.
వెంకటాపురంనూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు గ్రామ వద్ద ప్రదాన రహదా రిపై శనివారం ఉదయం వెంకటాపురం పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే పోయే వాహనాలను పరిశీలించి, అపరిచిత వ్యక్తుల సమాచా రాన్ని రాబట్టారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్, సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.