ధ్రువీకరణ పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం : ఎస్సై ఆర్. అశోక్.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పోలీస్ స్టేషన్ పరిధిలో, అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతున్న ద్విచక్ర వాహనాల తో పాటు, సరైన వాహన పత్రాలు , నెంబర్ ప్లేట్ లు లేని 15 ద్విచక్ర వాహనాలపై వెంకటాపురం పోలీసు లు శనివారం కేసు లు నమోదు చేశారు. వాహనదారులు అందరు కూడా తప్పనిసరిగా వారి,వారి వాహనాలను ములు గు రిజిస్ట్రేషన్ ఆఫీసు నందు రిజిస్ట్రేషన్ చేపించు కొవాలని , నెంబర్ ప్లేట్ ను పొందాలని కోరారు.అదేవిధంగా ప్రతి వాహన దారుడు కూడా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తో పాటు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని, ఇదంతా వారి వారి స్వయం భద్రతా గురించి అని, తది తర రోడ్డు ప్రయాణ భద్రతా పరమైన అంశాలపై ఎస్.ఐ.అశోక్ వాహనదారులకు అవగాహన కల్పించారు. ఎవరైనా తల్లిదండ్రులు 18 సంవత్సరాల కంటే తక్కువ వయ సు కలిగిన పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి నట్లయితే పిల్లల యొక్క తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయబడు తుందని హెచ్చరించారు. అదేవిధంగా ఎల్లో నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరైనా వాహనాలను కిరాయి నిమిత్తం ఉపయో గించినట్లయితే వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుందని ఎస్.ఐ.అశోక్ తెలిపారు.