టీఎస్ గౌడ సంఘ మండల ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
తెలంగాణ జ్యోతి, వెంకటాపూర్ ప్రతినిధి: తెలంగాణ గౌడ సంఘం వెంకటాపూర్ మండల ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి లుగా పోశాల చంద్రమౌళి , మండ రాజు లను నియమిస్తూ తెలంగాణ ములుగు జిల్లా అధ్యక్షుడు ముసీని పల్లి మొండయ్య గౌడ్ ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రం అందజేశారు . ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గట్టు శంకర్ మాట్లాడుతూ గీత కార్మికులకు కృషి కొరకు మండల కమిటీ చేస్తామని అన్నారు . ఉపాధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ సహకరించిన గౌడ సంఘం నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పేట సర్పంచ్ గట్టు కుమారస్వామి, సంఘ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు కునూరి మహేందర్ గౌడ్ జిల్లా నాయకులు బిక్షపతి జనగం శ్రీనివాస్ దూలం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.