జ్యోతక్క గెలుపు కోసం గ్రామదేవత కు పూజలు
ఏటూరునాగారం ప్రతినిధి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేఅభ్యర్థి బడే నాగజ్యోతి విజయం కోసం గంగారం మండలం కోమట్ల గూడెం గ్రామ ప్రజలు గ్రామదేవతలకు పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ అదేశాల మేరకు శనివారం గంగారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి సూరయ్య ఆధ్వర్యంలో కోమట్ల గూడెం గ్రామ దేవతల వద్ద బడే నాగజ్యోతి అఖండ విజయం సాధించాలని కోరుతూ కొబ్బరి కాయలు కొట్టి గ్రామంలో 100 ఓట్ల ఇంచార్జీలతో ప్రచారం ప్రారంభించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు ఇర్పసురయ్య మాట్లాడుతూ సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన మెనిఫెస్టోలో పేదింటి మహిళకు నెలకు రూ. 3 వేలు వారి ఖాతాలో జమ చేస్తామనడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వెంట మేమున్నామంటూ మా ఓటు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతికే అంటూ హామిలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పిఎసిఎస్ డైరెక్టర్ దుర్గం సమ్మయ్య, నాయకులు దుర్గా సాంబయ్య, పైడి శంకర్ జాడి పాపయ్య, జనగాం తిరుపతి, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.