జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలి
– అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్ కు వినతిపత్రం అందజేత
ములుగు, డిసెంబర్15, తెలంగాణ జ్యోతి : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో చదువు తున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయూ జిల్లా అధ్యక్షుడు షఫీ అహ్మద్ మాట్లా డు తూ సమాజ సేవ చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల పిల్లల ఫీజుల విషయంలో పాఠశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయ న్నారు. కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు రాయితీ ఇవ్వాలని కలెక్టర్లు ఉత్త ర్వులు జారీ చేసినా యాజమాన్యాల తీరులో మార్పు రావడం లేదన్నారు. అనంతరం ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిఈఓ పాణిని మాట్లాడుతూ జర్నలిస్టు పిల్లల విషయంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజుల కోసం ఇబ్బంది పెట్టినట్లు తన దృష్టికి వచ్చినట్లయితే ఆయా ప్రైవేట్ పాఠశాలలపై తగిన చర్యలు తీసు కోవడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యు జే సం యుక్త కార్యదర్శి చుంచు రమేశ్, జర్నలిస్టులు శంకర్, రమేశ్, సునీల్, శ్రీను, సంపత్, ఆవుల వెంకన్న, కొమురయ్య, సంగరంజిత్, సీహెచ్ రాజు, సుమన్, పోలోజురామ్మూ ర్తి, శరత్, స్వామి, సృజన్, సంజీవ, మహేందర్, జె కోటేశ్వర రావు, అనిల్, శంకర్ పాల్గొన్నారు.