గుత్తి కోయిల పేరు చెప్పి దోచుకున్న సీతక్క

Written by telangana jyothi

Published on:

గుత్తి కోయిల పేరు చెప్పి దోచుకున్న సీతక్క

  • ఆ సొమ్ముతోనే ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేస్తుంది
  • కాంగ్రెస్ ని బొంద పెడితేనే ములుగులో అభివృద్ధి
  • టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి

తెలంగాణ జ్యోతి ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో ఉన్న గుత్తి కోయలను అభివృద్ధి చేస్తానని వివిధ దేశాల నుంచి సీతక్క నిధులు తీసుకొచ్చి దోచుకున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. బుధవారం వెంకటాపూర్ మండలంలోని గుంటూరు పల్లె, రామాంజపూర్, గుర్రంపేట, పెగడపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ గుత్తి కోయిల పేరు చెప్పి దోచుకోవడంతో పాటు చత్తీస్ ఘడ్ లో వేలకోట్ల కాంట్రాక్టులు చేసి.. సంపాదించిన అవినీతి సొమ్ముతో ములుగు ఓటర్లను మభ్యపెట్టి గెలవాలని చూస్తోందని అన్నారు. అవినీతి సొమ్ముతో ఈ ప్రాంత యువతను తాగుడుకు బానిస చేసి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతినేలా సీతక్క చర్యలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ రైతులను చులకనగా చూస్తూ రైతుబంధు అవసరం లేదంటున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్నారు. ప్రజలు అధికార పార్టీ వైపే ఉంటేనే ములుగు అభివృద్ధి చెందుతుందని అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచిన కాంగ్రెస్ను బొంద పెట్టాలన్నారు. గతంలో ఈ ప్రాంతానికి చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడ్డారని అసెంబ్లీ సాక్షిగా ధన్యవాదాలు చెప్పి, ఇప్పుడు వారు నిధులు మంజూరు చేయలేదని సీతక్క అవాకులు చెవాకులు పేలుతుందన్నారు. కాంగ్రెస్ నేతల ద్వంద వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. 20 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న సీతక్క ములుగుకు చేసిందేంటో చెప్పకుండా కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటుందన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో పాల్గొని తన కు ఓటు వేసి ఆశీర్వదించాలని నాగజ్యోతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ సాంబారి రామారావు మండల పార్టీ అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, గ్రామ అధ్యక్షుడు పిన్నింటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now