గీతకార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి : మహేందర్ గౌడ్
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : జిల్లాలోని గీత కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటూ ములుగు జిల్లా గౌడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని గౌడ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కూనురు మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ గౌడ సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు ముసినిపల్లి మొండయ్య గౌడ్ , మహేందర్ గౌడ్ కు నియామక పత్రాలన్ని అందజేశారు . ఈ సందర్భంగా కూనూరు మహేందర్ గౌడ్, మాట్లాడు జిల్లాలోని గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా నన్ను గౌడ సంఘం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు సహకరించిన గౌడ సంఘం నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు . కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు బొడిగా బిక్షపతి గౌడ్, ఇంచర్ల, జంగాలపల్లి గౌడ సంఘం అధ్యక్షులు, జనగాంశ్రీనుగౌడ్, ఉపాధ్యక్షులు, వేముల వేణు గౌడ్, తదితరులు ఉన్నారు.