గిరిజన గ్రామాల్లో దూసుకుపోతున్న కారు.
- ప్రచారం లొ ఎదురేగి స్వాగతం పలుకుతున్న ఆదివాసీలు..
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు పంచాయతీలో సోమవారం భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు విజయం కాంక్షిస్తూ, పార్టీ నేతలు సోమవారం గిరిజన గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోకి వెళ్లిన ప్రచార రథాలకు వాహనాలకు, గ్రామాల్లోని ఓటర్లు ప్రజలు ఆదివాసీలు ఎదురేగి జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ కారు గుర్తుకే ఓటు వేసి డాక్టర్ గారిని గెలిపించుకుంటామని హర్షద్వానాల మధ్య స్వాగతం పలికారు. ప్రతిపక్ష పార్టీలు కలబోలి మాటలు చెప్పి మాయల మరాఠీల లాగా ఓట్లు వేసుకొని కనుమరుగవుతున్నారని,ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలతో తామంతా లబ్ధి పొందుతున్నామని భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు ప గెలిపించుకొని కారు గుర్తుకే ఓట్లు వేస్తామని గ్రామాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలు, ఓటర్లు ఆదివాసీలు ప్రకటించారు. సురవీడు పంచాయతీలో బీర్ ఎస్ పార్టీ విస్తృత ప్రచారం ను విజయపురి కాలనీ, రామంజపురం, కే. కొండాపురం గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంజా గంగ, సీనియర్ నాయకులు చిలుకూరి సతీష్ వెంకటేశ్వర్లు, బాలకృష్ణ,సీనియర్ నేత ఎస్.కె ముస్తఫా, రాజేష్, మురళి ,వాదం శివకృష్ణ ,జి కృష్ణ వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. సూరవీడు పంచాయతీలోని, మారుమూల గిరిజన గ్రామాల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమంతో గ్రామాల్లో హోరెత్తింది. ఆయా గ్రామాల ఆదివాసీలు, ఓటర్లు ఏకవాఖ్య తీర్మానంతో, భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని, పార్టీ నినాదాలతో అటవీ గ్రామాల్లో ప్రచారంలో హోరెత్తించారు.