కోటగుళ్లలో ఘనంగా కార్తీక వనభోజనాలు, సామూహిక వ్రతాలు
గణపురం, తెలంగాణ జ్యోతి : కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో కార్తీకమాస ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలోని ఉసిరి, మారేడు వృక్షాల వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలు కార్తీక వనభోజనాలను కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడు నిర్వహించే పూజా కార్యక్రమాలలో భాగంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు మన భోజనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు గోవర్ధన వేణు గోపాలచార్యులను ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ లను ఘనంగా సన్మానించి పట్టు వస్త్రాలను అందజేశారు.