కృష్ణాపురం వద్ద విస్తృతంగా వాహనాలు తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం కృష్ణాపురం ఆవుట్ కట్స్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం పేరూరు పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని చేపట్టారు. చత్తీస్గడ్ సరిహద్దులో ఉన్న పిఎస్ పరిది లోని ప్రధాన రహదారిపై ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అసాంఘిక శక్తుల కార్యకలాపాల అరికట్టటం ల్లో భాగంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేం దుకు, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా, ప్రజా భద్రత నిమిత్తం ఉన్నతాధికారుల ఆదేశంపై పోలీస్ శాఖ విస్తృతంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా కృష్ణాపురం జాతీయ రహదారిపై పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. రమేష్ ఆధ్వర్యంలోగురువారం ఉదయం వచ్చే పోయే వాహనాల ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని ఈ సందర్భంగా రాబట్టారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కాండా క్ట్ అమలులో ఉన్నందున ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా మద్యం, ఆధారాల్లే ని నగదు ఇతర సామాగ్రిని తరలించ రాదని అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఇంధన శకటదారులకు అవగాహన కల్పించారు. వాహనాల తనిఖీల కార్యక్రమంలో పేరూరు సివిల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
1 thought on “కృష్ణాపురం వద్ద విస్తృతంగా వాహనాలు తనిఖీలు. ”