కుసుమ జగదీష్ ను విస్మరించిన బిఆర్ఎస్ పార్టీకి పతనం తప్పదు.
– పద్మశాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్ప అశోక్
తెలంగాణ జ్యోతి, నవంబర్ 16, ఏటూరు నాగారం : తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ పార్టీని ములుగు జిల్లాలో తన భుజ స్కందాల మీద వేసుకొని పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన దివంగత జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ను విస్మరించిన టిఆర్ఎస్ పార్టీకి పద్మశాలీలు తగిన గుణపాఠం చెప్పాలని పద్మశాలి రాష్ట్ర ఉపాధ్యక్షులు చిప్ప అశోక్ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీని గద్దే దించడమే లక్ష్యంగా పద్మశాలీలందరూ ఐక్యంగా కంకణ బద్ధులై పని చేయాలన్నారు. టిఆర్ఎస్ పార్టీకి గుండెకాయ లాగా ఉన్న జగదీష్ అన్న చనిపోయి మూడు నెలలు గడవక ముందే టిఆర్ఎస్ పార్టీ జగదీష్ అన్న ను విస్మరించిందని. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా ఏ రోజు కూడా జడ్పీ చైర్మన్ జగదీష్ ప్రస్తావన తీసుకురాకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగదీష్ చనిపోయి నప్పుడు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు, కేటీఆర్, హరీష్ రావు లు హాజరయ్యారు. జగదీష్ ను గుర్తించి ఆయన అంతక్రియలు అధికారికంగా జరపకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు. జగదీష్ అభిమానులు పద్మశాలి సంఘం సభ్యులు బి ఆర్ ఎస్ నాయకుల తీరుపై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పద్మశాలి లను విమర్శించే ఏ రాజకీయ పార్టీలకైనా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ బీసీలకు పద్మశాలిలకు ఎక్కడ కూడా టికెట్లు కేటాయించలేదని మరోసారి గుర్తు చేశారు. రాజకీయంగా వారి పబ్బం గడుపుకోవడం కోసం పద్మశాలీలను ఓటు బ్యాంకుగా పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు. కందగట్ల వేణు. కిషోర్ కుమార్. రాధిక. లోటపెట్టల రాజేష్ , శ్రీను, సర్వేశ్వర రావు, ఇర్శ వడ్ల పూర్ణ చందర్, చిడురాల గంగాధర్, రాము, కృష్ణ, బట్టు గోపి, వెల్డంటి సమ్మయ్య, చెన్న ప్రశాంత్ బుర వెంకన్న, చామంతి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.