కాకతీయుల నిర్మాణాలు అద్భుతం
– ఆస్ట్రేలియన్ పరిశోధక విద్యార్థి చేయా
గణపురం, తెలంగాణ జ్యోతి : కాకతీయులు నిర్మించిన ఆలయాలు అద్భుతమని ఆస్ట్రేలియా దేశానికి చెందిన పరిశోధక విద్యార్థి చేయా అన్నారు. గురువారం ఆయన వరంగల్ వేయి స్తంభాల గుడి, ఫోర్ట్ వరంగల్, రామప్ప దేవాలయాలతో పాటు కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్లను సంద ర్శించారు. మొదట ఆలయంలో పూజలు నిర్వహిం చారు. అనంత రం ఆలయ శిల్ప సంపదను ప్రాకారపు ఆలయా లను వీడియోలు ఫోటోలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల రాతి కట్టడాలు ఎంతో అద్భుతమని కాకతీయులు నిర్మించిన ముఖ్య ఆలయాలను చూసానని ఇది ఎంతో అనుభూతి నిచ్చిందన్నారు. భారతదేశంలోని ముఖ్య కట్ట డాలను పరిశీలించి వాటిపై పరిశోధన చేస్తున్నట్లు చేయా తెలి పారు. అనంతరం అర్చకులు నరేష్ ఆయనకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.